Garuda Gamana Tava in Telugu Lyrics and Meaning
Song: Garuda Gamana Tava
Lyrics: Jagadguru Sri Bharati Tirtha Mahaswamiji,
Acknowledgements to: Jagadguru Sri Bharati Tirtha Mahaswamiji,
Singers: Gayatri Narayanan, Yashaswini, Panchangam Sisters
Flute: Pramodh Umapathi
Percussion: Anil Robin
Music: Ch Megha Shyam Acharya
Lable: Murthy Music
Producers: Krishna Murthy Padala, SJSS Kumar Padala
Telugu Lyrics:
గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం |
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ||
జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుతపదపద్మ |
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ || ౧ ||
భుజగశయన భవ మదనజనక మమ జననమరణభయహారి |
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ || ౨ ||
శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోకశరణ |
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ || ౩ ||
అగణితగుణగణ అశరణశరణద విదళితసురరిపుజాల |
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ || ౪ ||
భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీతీర్థం |
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ || ౫ ||
ఇతి జగద్గురు శ్రీభారతీతీర్థస్వామినా విరచితం శ్రీమహావిష్ణు స్తోత్రమ్ ||
Meaning:
అర్దము -
ఓ గరుడ వాహనుడా నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నన్ను నా తాపములనుండి నా పాపముల నుండి విముక్తి చేయుము.
1. పద్మనేతృడా బ్రహ్మేంద్రాది విబుధ గణముచే వినతులు పొందు పదపద్మములు కలవాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
2. ఆదిశేష తల్ప శయనా మన్మధుని తండ్రీ నా జనన మరణ భయములను తీర్చువాడా నన్ను నా తాపమములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
3. శంఖ చక్రధరుడా, దుష్టులైన రాక్షసుల నుండి సర్వలోకములకు రక్షణము కల్పించు వాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
4. లేక్కలేనన్ని సుగుణములు కలవాడా దీనులకు దిక్కైనవాడా దేవతల వైరులను దునుమువాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
5. నీభక్తుడనైన ఈ భారతీ తీర్థుని మహా కరుణతో రక్షించుము. నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
Enjoy and stay connected with us!!
►Subscribe us on BhakthiVisheshalu Youtube : / @bhakthivisheshalutv
►Like us : / bhakthivisheshalu
SUBSCRIBE BhakthiVisheshalu Channels :
►For Muggulu : / @fridayrangoli
#garuda #garudagana