Police Constable 800 Meters Running | 800 Meters Running Test | TS Police Jobs | AP Police Jobs
‼➖శాతవాహనులు➖‼
■1). ప్రాచీన కాల మూలాధారాలను తెలుగువారిని గురించి ప్రస్తావించినది ?
జ: ఐతరేయ బ్రాహ్మణం
■2). ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యం లోని వారిని అశోకుడు ఈ శాసనం వివరించింది ?
జ: 13వ శిలాశాసనం
■3). ఆంధ్ర శబ్దాన్ని భాషాపరమైనదిగా మొదటిసారిగా ఎపుడు గుర్తించారు ?
జ: నందంపూడి శాసనంలో
■4). శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు ?
జ: శ్రీముఖుడు
■5). ఆంధ్రులు పట్టణాలు సైనిక బలగాలు గురించి తెలిపిన గ్రీకు రాయబారి ఎవరు ?
జ: మెగస్తనీస్
■6). ఇటీవల కోటిలింగాలలో లభించిన నాణేలు ఎవరికి చెందినవి ?
జ: శ్రీముఖుడు
■7). శాతవాహనులు హలుడు సంఖ్య ఎంత ?
జ: 17
■8). కవి వత్సలుడు అని ఎవరిని అంటారు ?
జ: హలుడు
■9). శ్రీ పర్వతం పై పారావత విహరాన్ని ఎవరి కోసం నిర్మించారు ?
జ: ఆచార్య నాగార్జునుడు
■10). సుహృల్లేఖ గ్రంథ రచయిత ఎవరు ?
జ: నాగార్జునుడు
■11). మ్యాకదొని శాసనం ఎక్కడ లభించింది ?
జ: బళ్లారి
■12). లేఖకుడు అనే ఉద్యోగి విధి ఏమిటి ?
జ: రాజా పత్రాలను భద్రపరచటం
■13). పట్టణ పాలన నిర్వహించే నిగమ సచల ప్రస్తావన ఎక్కడ ఉంది ?
జ: భట్టిప్రోలు శాసనం
■14). గుమిక అంటే ?
జ: గ్రామ అధికారి
■15). గహపతులు అంటే ?
జ: నిగమ సచల సభ్యులు
■16). తెరచాప స్తంభాలున్న నాణేలు ఎవరివి ?
జ: శాతవాహనులు
■17). శాతవాహనుల నాణేలు తయారీ కేంద్రం ఎక్కడ లభించింది ?
జ: కొండాపూర్
■18). శాతవాహనులు నాణేలు ఏ లిపిలో ఉన్నవి ?
జ: బ్రహ్మీ
■19). సార్థవాహకులు అంటే ?
జ: విదేశాలలో వర్తకం చేసేవారు
■20). తమ పేర్లతో పాటు మాతృనామాలను ఏ రాజులు ధరించారు ?
జ: శాతవాహనులు
■21). శాతవాహనుల నాణేలు ప్రాచీనమైనవి ఏ లోహంతో తయారు చేశారు ?
జ: సీసం
■22). జోగుల్తంబి తరహా నాణేలు ఎవరిది ?
జ: శాతవాహనులు
■23). శాతవాహనులు ఎవరు ?
జ: బ్రాహ్మణులు
■24). హిందూమతంలోని ఏ శాఖను ప్రజలు ఆదరించారు?
జ: పౌరాణిక
■25). ఆంధ్ర దేశంలో తొలి శివలింగం ఎక్కడ లభించింది?
జ: గుడిమల్లం
■26). సమయసారం గ్రంథ రచయిత ఎవరు ?
జ: కొండ కుందా చార్యుడు
■27). కరీంనగర్ జిల్లా లో మునుల గుట్ట ఏ మతానికి చెందినది ?
జ: జైనమతం
■28). దక్షిణ పదంలోని తొలి బౌద్ధ గుహలు ఎవరి కాలానికి చెందినవి ?
జ: శాతవాహనులు
■29). పూర్వ శైల, అపరశైవ అనే బౌద్ధ మత శాఖల వారు ఆంధ్రదేశంలో అక్కడ నివసించే వారు ?
జ: నాగార్జునకొండ