About Temple
శంబలనగరికి ఒట్టి చేతులతో వచ్చి , దైవ శక్తి చైతన్యా న్ని స్వీ కరించి అనుభూతి పొందవచ్చు. శంబలనగరిగాయత్రిమాత మందిరంలో కొలువైఉన్న గాయత్రీ మాత శాంతి స్వరూపం. కరుణించే చూపు, చిరుమందహాసంతో, కమలం మధ్యలో హంసవాహనురాలై, తూర్పుకు అభిముఖంగా ఆశీనులై ఉన్నారు. సుమారు 1800 కిలోల బరువు గల 9 అడుగుల ఎత్తు ఉన్న పంచలోహ విగ్రహం. గాయత్రి మందిరం పై సూర్యోదయపు లేలేత కిరణాలు, ఆ మందిరంపైఉన్న కలశం పైనుంచి, నెమ్మది, నెమ్మదిగా మాత విగ్రహాన్ని తాకినప్పటి దృశ్యం సంబ్రమాశ్చర్యాలతో పాటు ఎటువంటి ఆలోచనలు లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రత్యక్ష దైవాలు ఏ విధం గా కలశం పైనుంచి మందిరం లో కొలువైఉన్న గాయత్రి మాత విగ్రహం లోకిసృష్ఠి చైతన్య ప్రవేశం జరుగుతుందో అదేవిధంగా. ఋషితండ్రితపశ్శక్తిని మందిరం పై గల కలశం నుండిగాయత్రీ మాత విగ్రహం లోకితద్వారా అక్కడ నేల లోకినిరంతరం చైతన్యం ప్రవహిస్తూనేఉండటం వలన దర్శనానికివచ్చి న వారందరూ వారికి తెలియ కుండానే మౌనంగా చైతన్యా న్ని స్వీ కరించగలుగుతున్నారు.