@RFInformationServices
@rfinformationservices
నేల ఆరోగ్యానికి పచ్చిరొట్ట పైర్ల సాగు | Green Manure Cultivation to Improve Soil Fertility
నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువు ను సాగు చేసుకోవడం వలన భూమిని సారవంతంగా మార్చుకోవచ్చు. ఈ పచ్చి రొట్ట పైర్లుగా జనుము, జీలుగ, పిల్లి పెసరను సాగు చేసుకోవాలి పచ్చిరొట్ట ఎరువుల కోసం నిర్దేశించిన మొక్కలను పొలంలో కలియదున్నడం వల్ల అవి కుళ్లి మొక్కలకు సారవంతమైన భూమిని అందిస్తుంది. పచ్చి రొట్ట పైర్లు పూతదశకు రాగానే నేలలో కలియదున్నితే ఎక్కువ మోతాదులో నేలకు పోషకాలు అందుతాయి. పచ్చిరొట్టె వల్ల భూమి సారవంతంగా మారుతుంది. పశువుల పేడకంటే పచ్చిరొట్ట పది రెట్లు భూమిని ఎక్కువ సారవంతం చేస్తుంది. వీటి వలన నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. మొక్కలు నాటిన 25 నుంచి 30 రోజుల్లోనే పంట ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. మొక్కలు బాగా పెరిగేందుకు క్రమపద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. 25 నుంచి 30 రోజులకు మొక్కలు ఏపుగా పెరిగి పూతదశకు చేరుకుంటుంది.ఈ సమయంలో మొక్కలను రోటోవేటర్ సహాయంతో కలియదున్నాలి. దున్నిన అనంతరం 100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ను దుక్కిలో వేయాలి. సూపర్ పాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. కుళ్లే దశలో నీటిని సక్రమంగా అందించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట ఎరువులకు ముఖ్యంగా జీలుగ, జనుము, పిల్లి పెసర, వాటిని రైతులు ఎక్కువగా ఉపయోగిస్తారు.వీటిని పూతదశలో కలియదున్నడం వల్ల ఎకరానికి 9 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.
పచ్చిరొట్ట సాగులో మెళకువలు మరియు లాభాలు:
ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తుకోవాలి.తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి.నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం.రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకొని కలియ దున్నవచ్చు. ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుంది.మొక్కలకు 2 శాతం నత్రజని, సూపర్పాస్పేట్ను అదనంగా అందుతుంది.జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.నేలలో కరుగని మూలకాలను పంటకు అనుకూలంగా మార్చుతాయి.నీటి నిల్వ సామర్ధ్యం పెంచుతుంది.లెగ్యూంజాతికి చెందిన మొక్క కావడంతో వేర్లల్లో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.నేల భౌతిక స్థితి (నేల ఆకృతి) మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోనికి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి.జీవ రసాయన చర్యల వల్ల నేల సారం పెరుగడమే కాక, నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామార్థ్యాన్ని పెంచుకుంటుంది.భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడుతాయి.కలుపు మొక్కలు పెరుగకుండా నివారించవచ్చు.చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడుతాయి. సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేటట్లు చేస్తాయి. పచ్చి రొట్ట పైర్లు ఎరువులు గానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతాయి.పచ్చిరొట్టతో వ్యవసాయ భూమి సారవంతంగా తయారు అవుతుంది. కలుపు మొక్కలను నివారించడానికి, భూసారం పెరగడానికి రైతులు విధిగా పచ్చిరొట్ట సాగు చేయాలి. పచ్చిరొట్ట వల్ల పశువుల పేడ కంటే పది రెట్లు ఎక్కువ భూమి సారవంతమై ఎరువుల వాడకం తగ్గుతుంది.పైరు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడుతుంది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో ఆరోగ్యకర ఉత్పత్తులను సాధించవచ్చు.
Green manure cultivation, Green Manure seed, green manure fertilizer, green manure farming, green manure process, what is green manuring, best green manure crops, green manure crop, green manuring and organic fertilizers, green manure, green manure crops telugu, green manure plants, types of green manure, green manure crops telugu, green manure farming, green manure and bio fertilizer, green manure application, dhaincha green manure, పచ్చిరొట్ట పైర్ల సాగు, జనుము, జీలుగా, పిల్లి పెసర